బంగారం రికార్డు ధరలకు కారణం?
NEWS Oct 22,2024 07:43 am
బంగారం ధరలు లైఫ్ టైం హైరేంజ్‌కు చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 వేల రూపాయలకు చేరింది. కిలో వెండిపై లక్ష రూపాయలు దాటింది. బంగారం, వెండి ధరలు రికార్డుస్థాయికి చేరుకోవడంతో కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు ట్రేడర్లు. డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరగడం, గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండడం, డాలర్ బలోపేతం కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు వంటి కారణంగానే ధరలు పెరుగుతున్నట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.