రోడ్ల నిర్మాణానికి సిద్ధం: మంత్రి దామోదర్
NEWS Oct 22,2024 06:19 am
అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్ నిమోజకవర్గంలోని అన్ని మండలాల్లో నూతన రోడ్ల నిర్మణానికి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోడ్ల నిర్మాణాలకు 25.08కోట్లు రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వీలైనంత త్వరగా రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.