అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు
NEWS Oct 22,2024 06:03 am
మెదక్ పట్టణంలోని 700 సర్వే నెంబర్ క్రీడా ప్రాంగణ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు మైనారిటీ నాయకుడు ఫాజిల్. మెదక్ పట్టణంలోని అజంపురలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా ప్రాంగణం ప్రారంభించిందన్నారు. అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకొని, క్రీడా ప్రాంగణం స్థలాన్ని రక్షించాలని కోరారు.