AP: నేడు డ్రోన్ సమ్మిట్ ప్రారంభం
NEWS Oct 21,2024 06:31 pm
ఏపీ రాజధాని అమరావతిలో నేడు, రేపు డ్రోన్ జాతీయ స్థాయి సమ్మిట్ జరగనుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు. డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరిస్తారు. ఏపీని డ్రోన్ హబ్ గా తీర్చిదిద్దడమే ఈ సమ్మిట్ లక్ష్యం.