బండలింగాపూర్ లో ఆదర్శ వివాహం
NEWS Oct 21,2024 07:11 pm
బండలింగాపూర్ లో బదిరుల (చెవిటి- మూగ) తోట శిరీష, శంభోజి నాగరాజుల మధ్య ఆదర్శ వివాహం జరిగింది. శ్రీ శ్రీనివాస గురుకుల విద్యాలయం నేస్తం ఆధ్వర్యంలో ఈ వివాహ కార్యక్రమానికి నేస్తం ఫౌండేషన్ సభ్యులు, సంస్థ తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ వివాహ కార్యక్రమం ప్రతి మిత్రుని సహకారంతో జరిగిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్థ తరపున భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వివాహ కార్యక్రమంలో బొడ్ల ఆనంద్, గోనే వినయ్, నాంపల్లి, తదితరులు పాల్గొన్నారు.