ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 21,2024 07:04 pm
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఐకెపి ఆధ్వర్యంలో బాకురుపల్లి తండా గ్రామంలో గ్రామ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను బోప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాభేరా బేగం, వైస్ చైర్మన్ గుండాడి వెంకట్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఓ అధ్యక్షురాళ్లు, డైరెక్టర్లు, సెంటర్ ఇంచార్జీలు సుధాకర్, ఎపియం మల్లేశం, గ్రామ సంఘం అధ్యక్షురాలు సునీత, మహిళలు, రైతులు, హమాలీలు, వివోఏ భాగ్యాలక్మి, బుక్ కీపర్, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.