అనుమల ప్రభావతికి నివాళులర్పించిన బత్యాల
NEWS Oct 21,2024 06:55 pm
రైల్వేకోడూరు: సోమవారం రైల్వేకోడూరుకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డా. ఎ. సుబ్రహ్మణ్యం సతీమణి అనుమల ప్రభావతి ఆకస్మికంగా మృతి చెందారు. వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.