కెవి పల్లి మండలం చెంచురెడ్డి పల్లికి చెందిన నగిరి మడుగు రాజారెడ్డి సోమవారం ఆవులను మేత కోసం పొలంలోనికి తీసుకెళ్లారు. మేత మేస్తున్న సమయంలో పిడుగు పడి అక్కడికి అక్కడే రెండు ఆవులు మృతి చెందాయి. జీవనాధారంగా ఉన్న రెండు ఆవులు మృతి చెందడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రాజారెడ్డి వేడుకుంటున్నాడు.