అనుమతి లేని నిర్మాణాలు పరిశీలన
NEWS Oct 21,2024 02:10 pm
అల్లూరి జిల్లా, హుకుంపేట మండలంలోని మెరక చింత పంచాయితీ, మెరకచింతలో నాంది ఫౌండేషన్ మాక్స్ సొసైటీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను స్థానిక ప్రజలతో కలిసి, మండల ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. ఏజెన్సీలో నిర్మాణాలు చేపట్టాలంటే, పీసా చట్టం అనుమతి ,పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం, పంచాయితీ అఫ్రూవల్ తప్పనిసరి, ఐనా ఏ అనుమతులు లేకుండానే శాశ్వత నిర్మాణాలు నాంది ఫౌండేషన్ చేపట్టడాన్ని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.