ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ కరువైందని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఆడపిల్లలపై ఆగడాలు అధికమయ్యాయి ఆమె పేర్కొన్నారు. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన దిశ ఘటన తర్వాత అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశ యాప్ ను ప్రవేశపెట్టిందని అటువంటి యాప్ ను నిర్వీర్యం చేయడంతో మహిళలకు రక్షణ కరువైందని ఆమె అన్నారు. దిశా పోలీస్ స్టేషన్లను సైతం మార్పు చేయడం జరిగిందని గుర్తు చేశారు.