మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు
NEWS Oct 21,2024 02:02 pm
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ సాయి నగర్ గ్రామంలో మద్యం దుకాణం వద్దని ఆ ప్రాంత మహిళలు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. నూతన మద్యం పాలసీ ద్వారా సాయి నగర్ లో గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల తప్ప తాగి గ్రామాలలో సమస్యలు వస్తాయని, నియమ నిబంధనలు పాటించి దుకాణాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.