విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి: DSP
NEWS Oct 21,2024 01:47 pm
జగిత్యాల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం జగిత్యాల పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో విద్యార్థిని విద్యార్థులకు జగిత్యాల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డి.రఘు చందర్, జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ఎస్ వేణుగోపాల్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ అధికారులు విద్యార్థిని విద్యార్థులకు పట్టుదలతో, ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలు సూచనలు చేశారు.