నాగచైతన్య- శోభిత పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల ఫోటోను శోభిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన తల్లితో పాటు అత్యంత సమీప బంధువుల సమక్షంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఎరుపురంగు చీర ధరించి పెళ్లికి ముందుకు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారంగా పెళ్లి వేడుకలో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 8న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.