ప్రజా దర్బార్ కార్యక్రమంలో వినతులను
స్వీకరించిన ఎమ్మెల్యే
NEWS Oct 21,2024 01:52 pm
మడకశిర పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పే స్వామి అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికేనని రాజు అన్నారు.రూరల్ మండలాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు.