కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి చేరికలు
NEWS Oct 21,2024 01:53 pm
ఆగళి మండలం పూలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగేష్ యాదవ్, ఈరన్న, రేవన్న తిమ్మారెడ్డి రాజు, తదితర కుటుంబాలు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండు మాల తిప్పేస్వామి,పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు పేర్కొన్నారు.