విద్యాశాఖ అధికారిని సన్మానించిన హెడ్మాస్టర్లు
NEWS Oct 21,2024 01:53 pm
జూలూరుపాడు ఎంఈవోగా ఇటీవల బానోతు జుంకీలాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం వారిని మండల పరిధిలోని పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యా యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంఈఓకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.