ఈనెల 23న కలెక్టర్ కార్యాలయం ముట్టడి
NEWS Oct 21,2024 12:29 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా అన్నారు. అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కరపత్రం ద్వారా ప్రచారం నిర్వహించారు.