జర్నలిస్టుపై దాడి చేసిన వారిని శిక్షించాలి
NEWS Oct 21,2024 12:24 pm
మెట్‌పల్లి: జర్నలిస్టులపై దాడులకు నిరసనగా మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇల్లందులో జర్నలిస్ట్ సుదర్శన్‌పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఆగ సురేశ్, సంజీవ్, దాసం కిషన్, అజీమ్, ఆఫ్రిరోజ్, హైమద్, మోసిన్, తదితరులు పాల్గొన్నారు.