పవన్‌కు సమన్లు జారీ చేసిన కోర్టు
NEWS Oct 21,2024 12:09 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ నాణ్యతపై పవన్ చేసిన వ్యాఖ్యలతో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రామారావు అనే న్యాయవాది పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా లడ్డూ నాణ్యతపై వ్యాఖ్యలు చేశారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును రామారావు కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు పవన్‌కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.