దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ వైఎస్ జగన్‌కి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. అయితే సార్.. అయన్నపాత్రుడు సార్ నమస్కారం సార్.. అనాల్సి వస్తుందనే సిగ్గుతోనే జగన్ అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వస్తే సీఎం చంద్రబాబు అయినా సరే.. స్పీకర్ పదవికి నమస్కారం పెట్టాల్సిందేనన్నారు అయ్యన్న. నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని.. జగన్ సరదాగా ఓసారి అసెంబ్లీకి రావాలన్నారు. వస్తే ఇద్దరం కలిసి ముచ్చటించుకుందామంటూ సెటైర్లు పేల్చారు.