బీర్పూర్ మండలంలోని తాళ్ళధర్మారం గ్రామంలో ఈరోజు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో దాదాపు వంద ఎకరాలలో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నివేదిక తయారుచేసి ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.