నూతన ఉపాధ్యాయురాలుకు ఘనంగా సన్మానం
NEWS Oct 21,2024 11:45 am
మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన సాదుల ప్రవళిక ఇటీవల ప్రకటించిన ఉపాధ్యాయ ఫలితాల్లో ఉద్యోగం సాధించి, మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో టీచర్‌గా అవకాశం వచ్చింది. దీంతో మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన సామాజికవేత్త రుద్ర రాంప్రసాద్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ప్రవళికని శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. పట్టుదలతో చదివి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని ఇదే మండలానికి ఉపాధ్యాయురాలుగా రావడం ఎంతో ఆనందంగా ఉందని రాంప్రసాద్ అన్నారు.