పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ
NEWS Oct 21,2024 12:27 pm
ఖమ్మం జిల్లా: మధిర పట్టణ పోలీస్ స్టేషన్ ను వైరా ఏసీపీ రెహమాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. దీనితోపాటు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.