మెమోరీస్ ఛాంపియన్ షిప్‌లో ఆణిముత్యం
NEWS Oct 21,2024 12:12 pm
జాతీయస్థాయిలో నిర్వహించిన జ్ఞాపక శక్తి పోటీలలో మణుగూరులోని రాధిక కాన్సెప్ట్ స్కూల్ 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జి.అఖిల్‌తేజ్ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, జాతీయ స్థాయిలో 8వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్రంలో 2వ ర్యాంక్ సాధించాడు. పాఠశాల యాజమాన్యం ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయిలోనే మెరిసిన గిరిజన ఆణిముత్యం అఖిల్ తేజ్ మొదటి వాడు. తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఛాంపియన్ షిప్ సాధించిడం పట్ల ఆనందంగా ఉందని దీని కృషి చేసిన పాఠశాల యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.