ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి
NEWS Oct 21,2024 12:28 pm
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.