AP: బీసీలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలి
NEWS Oct 21,2024 06:46 pm
ఎర్రగుంట్ల: కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎర్రగుంట్లలోని బీసీ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రగుంట్లలో విలేకరులతో మాట్లాడుతూ.. బీసీ రక్షణ చట్టం రూపొందించి వెంటనే అమలు చేయాలని, ఈ ఏడాది రూ. 30 వేల కోట్లు బీసీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలన్నారు. బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక రుణాలను ఇవ్వాలన్నారు.