పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
NEWS Oct 21,2024 02:08 pm
రాయచోటి: పోలీసు అమరవీరుల ధైర్యం, నిబద్ధత, అంకిత భావాల వలన సురక్షితమైన సమాజం నిర్మించబడిందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో కలెక్టర్ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన పోలీసు వీరులకు కలెక్టర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘనంగా నివాళులను అర్పించారు.