KMR: కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు అనారోగ్య బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య బారినపడిన బాధితులు ఎవరైనా ఉంటే ఆస్పత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులతో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు.