అయినవిల్లి మండలం కె.జగన్నాథపురం గ్రామంలో శనివారం ఉదయం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.