టేక్మాల్ మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారని అన్నారు. చిన్నపిల్లలు, వాహనదారుల వెంటపడి తరుముతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.