కోరుట్ల పట్టణంలో యువకుడి హత్య
NEWS Oct 15,2024 03:59 am
కోరుట్ల పట్టణంలో అర్ధరాత్రి హత్య కలకలం రేపింది. స్థానికుల ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం రోడ్డుకు చెందిన బోయిని సాగర్ (33) అనే యువకుడిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఐలాపూర్ రోడ్డులో కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి సీఐ సురేశ్ బాబు, ఎస్సై శ్రీకాంత్ చేరుకొని హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.