'పేదలను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
NEWS Jun 13,2026 06:14 pm
రెండున్నరేళ్లలో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో పేదల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నామని, పేద ప్రజలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. అనుకోకుండా అనారోగ్యంతో బాధపడ్డ ప్రజలను ఆదుకోవడానికి పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేస్తూ పేదలకు అండగా ఉంటున్నారని తెలిపారు.