వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
NEWS Oct 14,2024 01:48 pm
కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామమైన యకీన్ పూర్ లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తీరొక్క పూలు సేకరించి అందంగా బతుకమ్మను తయారు చేసుకుని పసుపుతో తయారుచేసిన గౌరమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ దుస్తులతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ, కోరుట్ల మున్సిపల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు.