మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రావులపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పూలతో ఆరడుగుల ఎత్తయిన బతుకమ్మను పేర్చి తోడు బతుకమ్మలతో ఉండాగా దాని చుట్టూ విద్యార్థినులందరూ లయ బద్ధంగా కోలాటం వేస్తూ, బతకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందోత్సాల మధ్య బతుకమ్మ పండుగ సంబరాలను జరుపుకున్నారు. కళాశాల నుండి బతుకమ్మను ఊరేగింపుగా జాతీయ రహదారి వెంట పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు.