ఇది మన ప్రభుత్వం కార్యక్రమం
NEWS Sep 21,2024 10:58 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం సచివాలయ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత మోర్త సత్తిబాబు, బిజెపి నేత గనిశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన నేత నల్లా చిన్నబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఒక్కొక్కటిగా ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు.