మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
NEWS Aug 27,2026 11:36 pm
పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లపై నినదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇది సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరాటంలో తొలి దశ మాత్రమేనని నాయకులు తెలిపారు.