బీజేపీనేత రమణ బర్త్‌డే వేడుకలు
NEWS Sep 20,2024 04:39 am
అమలాపురం: బిజెపి సీనియర్ నాయకులు, జిల్లా యువమోర్చా మాజీ సోషల్ మీడియా కన్వీనర్ యనమదల వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. బిజెపి జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్ల పవన్ కుమార్ తన నివాసంలో వెంకటరమణ ను దుస్సాలువాతో ఘనంగా సత్కరించి కేకు కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు అరిగెల నాని, అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త గోకరకొండ గంగన్న స్వామి, వై.సతీష్ తదితరులు పాల్గొన్నారు.