MLA, కలెక్టర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన
NEWS Sep 18,2024 04:15 pm
బెల్లంపల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనులను పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేదలకు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.