సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాగుపాము
NEWS Sep 18,2024 03:01 pm
జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. నాగు పామును గుర్తించిన ఆఫీస్ సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా, పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే జగిత్యాల జిల్లా కలెక్టరేట్ తో పాటు వివిధ అఫీసులు ఉండే క్యాంపు ప్రాంతంలో తరచూ విష సర్పాలు కనిపించడం సహజమే అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నాగుపాము ప్రత్యక్షమవడం కార్యాలయ సిబ్బందితో పాటు వినియోగదారులు కొద్దిసేపు ఆందోళన చెందారు.