గల్ఫ్ దేశంలో ఆగిన గుండె
NEWS Sep 18,2024 03:11 pm
ఉన్న ఊర్లో ఉపాధికరువై బతుకు భారమై ఎడారి దేశాలకు వెళ్లిన ఓ గల్ఫ్ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పట్టణంలోని కటికెవాడకు చెందిన కొత్తకొండ సాయికృష్ణగౌడ్(37) జీవనోపాధికోసం కువైట్ దేశం వెళ్లాడు. 2 రోజుల క్రితం పని ముగించుకొని రూంలో నిద్రిస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. కృష్ణ గౌడ్ మృతదేహాం స్వగ్రామం బుధవారం చేరుకుంది. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. దయనీమైన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్టానికులు కోరుతున్నారు.