ప్రమాదాలకు కారకులైన అధికారులపై
హత్యకేసు నమోదు చేయాలి: సంకె రవి
NEWS Sep 18,2024 04:56 pm
సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోవడం ప్రభుత్వ, యాజమాన్యం హత్యలే అని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వారం రోజుల్లో శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇద్దరు కార్మికులు మరణించారని తెలిపారు. ప్రమాదాలకు కారకులైన అధికారులపై హత్య కేసు నమోదు చేసి, మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.