గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన
NEWS Sep 18,2024 04:18 pm
మెట్పల్లి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మహా కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి సూపర్వైజర్ షమీం సుల్తానా వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.