అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన
NEWS Sep 18,2024 05:02 pm
కథలాపూర్: కథలాపూర్ మండలం గంభీర్పూర్లో గల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. బిడ్డకు 6 నెలలు నిండగానే తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని అందించాలని సూపర్వైజర్ హైమది బేగం సూచించారు. ఆహారం తినిపించే పద్ధతులు, శుభ్రత గురించి వివరించారు. తల్లులు, కిశోర్ బాలికలు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. ఎంఎలెచ్పీ సౌమ్య, అంగన్వాడీ టీచర్లు శారద, వసంత, మణెమ్మ, నీరజ తదితరులున్నారు.