గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం
NEWS Sep 18,2024 04:17 pm
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం శోభాయాత్ర విజయవంతంగా జరిగినట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు దీపేష్ రేణ్వా కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఖండేల్వాల్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.