ఆత్మనగర్: పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
NEWS Sep 18,2024 04:02 pm
మెట్ పల్లి మండలం ఆత్మనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతాహి సేవ, స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛతలో భాగంగా ఆత్మనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పారిశుద్ధ్యంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నిజాముద్దీన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.