పౌర్ణమి పురస్కరించుకొని అన్నదానం
NEWS Sep 18,2024 05:03 pm
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకొని అన్నదానం చేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందని రామాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ ఏశాల సుశీల, బెజ్జారపు శ్రీనివాస్, యోగా గురూజీ డాక్టర్ రాజా రత్నాకర్, రేండ్ల రాజన్న, స్వామి పాల్గొన్నారు.