కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులు
NEWS Sep 18,2024 05:06 pm
జిల్లా పోలీసు శాఖకు ఎనలేని సేవలను అందించిన రవీందర్ మరణం వారి కుటుంబానికే కాకుండా జిల్లా పోలీసు శాఖకు తీరని లోటు అని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు. పుల్కల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్య సమస్యతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల క్రితం కన్నుమూశారు. కానిస్టేబుల్ రవీందర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్ శాఖ తరపున అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అందించే విధంగా చూస్తామన్నారు.