జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
NEWS Sep 18,2024 12:36 pm
గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని, అన్ని శాఖలు విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గడిచిన 11 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషితోనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు.