రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ మద్దతు
NEWS Sep 18,2024 12:33 pm
రుణమాఫీ కానీ రైతులకు మద్దతు పలికారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు. పార్టీ కార్యాలయం నుండి రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కు వినతి పత్రంతో పాటు రుణమాఫీ కానీ రైతుల వివరాల పత్రాలను అందించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్, జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు వొరకంటి రమణారావు, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గోన్నారు.