రెడ్డి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి:
రాష్ట్ర జేఏసీ చైర్మన్
NEWS Sep 18,2024 12:08 pm
రెడ్డి కార్పొరేషన్ కు ప్రభుత్వం రూపాయలు 5 వేల కోట్లు కేటాయించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర చైర్మన్ అప్పం గారి రాంరెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రామాయంపేటకు వచ్చిన సందర్భముగా విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం రెడ్డిల సంక్షేమ విషయమై ఎంత మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. తమ పోరాట ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, కానీ ఇంకా కార్పొరేషన్ చైర్మన్ ను నియమించలేదని వారు పేర్కొన్నారు.